Home  »  TV News  »  Karthika Deepam2: దీపే అసలైన వారసురాలు... గన్‌తో షూట్ చేసిన జ్యోత్స్న!

Updated : Mar 13, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం-2 (Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-616 లో.. దీపకి టెస్ట్ లు చేస్తుంది డాక్టర్. రిపోర్ట్స్ రాగానే చెప్తాను మీరు వెళ్ళండి అని డాక్టర్ అనగానే నా నెంబర్ ఉంది కదా డాక్టర్ నాకే ఫోన్ చేసి చెప్పండి అని జ్యోత్స్న అంటుంది. పదా దీప మనం హాస్పిటల్ కి వెళదామని దీపతో కార్తీక్ అనగానే ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీళ్ళేదని, రిపోర్ట్స్ వచ్చేవరకు మాతోనే ఉండాలని జ్యోత్స్న అంటుంది. నేను రాను అని కార్తీక్ అనగానే రిపోర్ట్స్ వచ్చేవరకు ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు.. అందరు మా ఇంట్లోనే ఉండాలని శివన్నారాయణ చెప్పి వెళ్ళిపోతాడు.

కావేరి, స్వప్న మాట్లాడుకుంటు ఉండగా దాస్ వస్తాడు. ఏంటి మామయ్య వచ్చారని స్వప్న అనగానే చెప్తాను ముందు ప్రసాదం తోసుకొని బొట్టు పెట్టుకోమని స్వప్నతో దాస్ అంటాడు. అప్పుడే కాశీని పిలిచి ప్రసాదం ఇస్తాడు దాస్. ఏంటి స్పెషల్ అని అడుగగా..ఈ రోజు మీ ఫస్ట్ ఆనివర్సరీ .. అంటే పెద్దలని ఎదురించి మీరిద్దరు పెళ్ళిచేసుకున్న రోజు అని దాస్ అనగానే స్వప్న, కాశీ షాక్ అవుతారు. ఆ తర్వాత ఇద్దరికి కలిసి ఉండమని చెప్పి దాస్ వెళ్ళిపోతాడు.  మరోవైపు దీప, కార్తీక్, శివన్నారాయణ, జ్యోత్స్న, పారిజాతం, కాంచన, శ్రీధర్ వస్తారు. వారిని చూసి దశరథ్ షాక్ అవుతాడు. ఏంటి మీరంతా ఎందుకు వచ్చారని దశరథ్ అడుగగా దీపని హాస్పిటల్ కి తీసుకెళ్ళామని చెప్తారు. ఎందుకు అని దశరథ్ అడగగా కార్తీక్ మనందరిని మోసం చేస్తున్నాడని డౌట్ వచ్చి సెకెండ్ ఒపీనియన్ కోసం వేరే హాస్పిటల్ కి తీసుకెళ్ళి టెస్ట్ లు చేపించామని మరికాసేపట్లో రిపోర్ట్స్ వస్తాయని జ్యోత్స్న అంటుంది. 

తన భార్య గురించి కార్తీక్ చూసుకుంటాడు.. వీళ్ళందరిని రెచ్చగొట్టి ఇలా చేసింది నువ్వేనా జ్యోత్స్న అనగానే అప్పుడే డాక్టర్ దగ్గర నుండి జ్యోత్స్నకి కాల్ వస్తుంది. దాంతో ఫోన్ ని లౌడ్ స్పీకర్ లో పెడుతుంది జ్యోత్స్న. దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ , దీప ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మీకు ఎవరో ఫాల్స్ రిపోర్ట్స్ ఇచ్చారని ఆ డాక్టర్ అంటుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఎందుకు అబద్ధం చెప్పారని అందరు కలిసి దీప, కార్తీక్ లని నిలదీస్తారు. దాంతో దశరథ్ నిజం చెప్పడానికి రెడీ అవుతాడు. దీప కడుపులో పెరుగుతున్న బిడ్డకి ప్రమాదం ఉంది.. అయితే అది సుమిత్ర వల్ల.. ఎందుకంటే దీపే మా కూతురు.‌. జ్యోత్స్న దాస్ కూతురు.. పారిజాతం పిన్ని పిల్లల్ని మార్చేసిందని దశరథ్ అనగానే శివన్నారాయణతో పాటు అందరు షాక్ అవుతారు. మీ మీద కోపంతోనే పారిజాతం పిన్ని ఇలా చేసిందని శివన్నారాయణతో దశరథ్ అనగానే పారిజాతం వంక కోపంగా చూస్తాడు శివన్నారాయణ. నా భార్య ప్రాణాలు కాపాడటానికి దీప తన కడుపులో బిడ్డని వదులుకోవడానికి సిద్ధపడిందని దశరథ్ అనగానే అందరు ఎమోషనల్ అవుతారు. నా కూతురు దీపే ఈ ఇంటికి వారసురాలు అని దశరథ్ అనగానే ఈ ఇంటికి వారసురాలు నేనే.. అని గన్ తీసి దీపని షూట్ చేస్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.